కథలాపూర్, జనవరి 7 : జగిత్యాల జిల్లా కథలాపూర్ భూషణరావుపేటకు చెందిన తెలంగాణ మార్క్ఫెడ్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డికి మాతృమూర్తి నర్సవ్వ బుధవారం కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. లోక బాపురెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఆయనతోపాటు కుటుంబసభ్యులకు సూచించారు.