హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ జైళ్లశాఖలో బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు జైళ్లశాఖలో పలువురు అధికారులను బదిలీ చేసేందుకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. చర్లపల్లి సెంట్రల్ జైల్, ఓపెన్ జైల్తో పాటు వరంగల్, సంగారెడ్డి జైళ్లకు కొత్త సూపరింటెండెంట్లను నియమించనున్నట్టు వినికిడి. నల్లగొండ డిస్ట్రిక్ట్ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న భరత్‌కు సంగారెడ్డి జిల్లా సబ్‌జైల్ ఆఫీసర్‌గా ఉద్యోగోన్నతి లభించినట్టు తెలిసింది. వరంగల్ పోస్టింగ్‌లో ఉండి సంగారెడ్డిలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న కళాసాగర్తో పాటు పోస్టింగ్ లేకుండా ఉన్న సంతోష్రాయ్ల బదిలీ, పోస్టింగ్‌లకు సంబంధించిన ఫైల్ హోంశాఖ వద్ద ఉన్నట్టు తెలుస్తున్నది. గురువారం ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.