Abhishek Sharma : భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే శతక గర్జన చేశాడు. తనకెంతో ఇష్టమైన టీ20 ఫార్మాట్లో తొలి సెంచరీతో చెలరేగాడు. ఆదివారం హారారే స్పోర్ట్స్ క్లబ్లో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ మెరుపు బ్యాటింగ్‌తో వంద కొట్టేశాడు.
మసకజ్ద వేసిన 14వ ‘హ్యాట్రిక్ సిక్సర్లు’బాది సెంచరీకి చేరువయ్యాడు. కేవలం 47 బంతుల్లోనే మూడంకెల మార్కు అందుకొని తన ఎంపిక సరైనదేనని చాటాడు. అనంతరం హెల్మెట్ తీసి.. డగౌట్ వైపు బ్యాట్ చూపిస్తూ సంబురాలు చేసుకున్నాడు.
📸 📸 That 💯 Feeling! ✨
Congratulations Abhishek Sharma! 👏 👏
Follow the Match ▶️ https://t.co/yO8XjNpOro#TeamIndia | #ZIMvIND | @IamAbhiSharma4 pic.twitter.com/EWQ8BcDAL3
— BCCI (@BCCI) July 7, 2024
జింబాబ్వేపై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ పలు రికార్డులు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌ల్లోనే వంద కొట్టి.. దీపక్ హుడా (Deepak Hooda)ను వెనక్కి నెట్టేశాడు. అంతేకాదు చిన్నవయసులోనే టీ20ల్లో సెంచరీ బాదిన నాలుగో క్రికెటర్‌గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. అతడి కంటే ముందు యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సురేశ్ రైనాలు ఉన్నారు.
ఐపీఎల్ ప్రదర్శనతో జింబాబ్వే పర్యటనకు ఎంపికైన అభిషేక్ తొలి మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. ఎన్నో అంచనాల మధ్య బ్లూ జెర్సీలో వచ్చిన అతడు నాలుగు బంతులాడి డకౌట్ అయ్యాడు. అయితే.. రెండో మ్యాచ్‌లోనే అభిషేక్ తన బ్యాట్ పవర్ చూపించాడు. సిక్సర్‌తో పరుగుల ఖాతా తెరిచిన అతడు ఆ తర్వాత బౌండరీలతో హోరెత్తించాడు. హాఫ్ సెంచరీ బాదాక మరింత దూకుడు పెంచిన అభిషేక్ 47 బంతుల్లోనే వంద కొట్టేశాడు.