శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - May 03, 2020 , 02:29:13

ఆకలి తీరుస్తున్న దాతలు

ఆకలి తీరుస్తున్న దాతలు

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌: అమీన్‌పూర్‌ పీజేఆర్‌ కాలనీలో కౌన్సిలర్‌ మహాదేవరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి పేదలకు అన్నం ప్యాకెట్లను పంచగా, చేగుంట, వడియారం బైపాస్‌ల వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం చేగుంట మండల శాఖ అధ్యక్షుడు చల్ల లక్ష్మణ్‌ బాటసారులకు పులిహోర, మజ్జిగ, తాగునీటి ప్యాకెట్లను అందజేశారు. హుస్నాబాద్‌ పట్టణంలో పేదలు, చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిత్యం ఉచిత మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్‌ లేబర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ డైరెక్టర్‌ దండుగుల రాజ్యలక్ష్మి చెప్పారు. హత్నూర మండలంలో 18రోజులుగా దౌల్తాబాద్‌కు చెందిన దుర్గామాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నారు. గజ్వేల్‌ 10వ వార్డులో ప్రజలు, పోలీసులకు కౌన్సిలర్‌ రహీం ఆధ్వర్యంలో నాయకులు బండి అరుణ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి అంబలి పంపిణీ చేశారు. తూప్రాన్‌ దుర్గాభవానీ సేవాసమితి అధ్యక్షుడు రాజేశ్వర్‌శర్మ ఆధ్వర్యంలో డీఎస్పీ కిరణ్‌కుమార్‌ పాదచారులు, ద్విచక్ర వాహనదారులకు వెజ్‌బిర్యాని, బట్టర్‌ మిల్క్‌ ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లను పంచగా, నర్సాపూర్‌లో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో పనిచేస్తున్న వలస కార్మికులకు కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌ అన్నదానం చేశారు.


logo