ఆటో డెబిట్ చెల్లింపులకు విఘాతం!
ఆటో డెబిట్ చెల్లింపులు| ఆర్బీఐ విధించిన నిబంధనలు అమలులోకి రావడం వల్ల ఏప్రిల్ 1 నుంచి ఆటో డెబిట్ చెల్లింపులకు విఘాతం ఏర్పడనున్నది.

ఆర్బీఐ కొత్త నిబంధనలే కారణం
ఏప్రిల్ 1 నుంచి ఏఎఫ్ఏ తప్పనిసరి
న్యూఢిల్లీ, మార్చి 30: టీవీ, ఓటీటీ, ఇంటర్నెట్ రీచార్జ్‌లు, పోస్ట్‌పెయిడ్ సర్వీసులు, ఇతర వినిమయ సేవలకు సంబంధించిన నెలవారీ బిల్లులను చెల్లించేందుకు ఆటో డెబిట్ సదుపాయాన్ని ఎంచుకున్నారా? అయితే రేపటి నుంచి మీ చెల్లింపులు ఆగిపోవచ్చు. ఆటో డెబిట్ పద్ధతిలో జరిపే చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ నిర్దేశించిన అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ) నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుండటమే ఇందుకు కారణం.
డెబిట్, క్రెడిట్ కార్డులతో జరిపే రికరింగ్ చెల్లింపులకు సంబంధించిన ఈ నిబంధనల ప్రకారం.. ఇకపై రూ.5 వేల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే ఆటో డెబిట్‌కు ఓటీపీ నిర్ధారణ తప్పనిసరి. దీంతో ఆటో డెబిట్ షెడ్యూల్ తేదీకి 5 రోజుల ముందే సంబంధిత బ్యాంక్ నుంచి వినియోగదార్లకు అలర్ట్ వస్తుంది. అప్పుడు ఓటీపీతో వెరిఫై చేస్తేనే ఆటో డెబిట్ పూర్తవుతుంది.
వాస్తవానికి ఏఎఫ్ఏ నిబంధనలను అమలు చేసేందుకు బ్యాంకులు సిద్ధం కాలేదు. మరోవైపు ఈ నిబంధనల అమలుకు నిర్దేశించిన గడువు (మార్చి 31)ను పొడింగించాలన్న ఐబీఏ విజ్ఞప్తిని రిజర్వు బ్యాంక్ ఇప్పటికే తిరస్కరించింది.
ఫలితంగా ఆటో డెబిట్ పద్ధతిలో బిల్లులు చెల్లిస్తున్న కస్టమర్లకు ఏప్రిల్‌లో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే యూపీఐ లోని ‘ఆటో పే’ ఫీచర్‌ను ఉపయోగించి రికరింగ్ చెల్లింపులు జరిపే వారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
మయన్మార్ మిలిటరీతో అదానీ గ్రూప్ డీల్.. బయటపడిన సంచలన నివేదిక
మహిళా సహాయకురాలితో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి అసభ్య ప్రవర్తన
దేశభక్తులకే పార్లమెంట్.. హాంకాంగ్‌పై చైనా పెత్తనం
శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్.. 87 శాతం సంస్థల మాట ఇదే
అప్పుపై కొనే కంటే లీజు కారు చౌక!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- auto debit
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

