e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్‌ ఈజీ..

ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్‌ ఈజీ..

ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్‌ ఈజీ..

న్యూఢిల్లీ: ప్ర‌తి ఒక్క‌రికి సొంతింటి నిర్మాణం ఓ క‌ల‌.. దాన్ని సాకారం చేసుకోవాలంటే ప‌లు స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక సీనియ‌ర్ సిటిజ‌న్లు ఒక సొంతిల్లు కొనుక్కోవాలంటే ఒక స‌వాల్. సొంత గూడు కావాలంటే ఈనాడు ల‌క్ష‌ల్లో పెట్టుబ‌డి పెట్టాలి. ఇంటి కొనుగోలు వంటి భారీ ప్రాజెక్టుల‌కు బ్యాంకులు కూడా రుణాలిస్తాయి.. అది సంబంధిత వ్య‌క్తికి స్థిర‌మైన ఉద్యోగం, రెగ్యుల‌ర్ ఇన్‌కం ఉన్న యువ‌కుల‌కు ఇంటి రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి సానుకూల అంశాలు..

పెన్ష‌న్ ఆధార సీనియ‌ర్ల‌కు రుణాలిలా..

కానీ సీనియ‌ర్ సిటిజ‌న్లు లేదా రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తిగా పెన్ష‌న్ ఆధారిత ఆదాయ‌మే జీవ‌నాధారం. ఈ ప‌రిస్థితుల్లో ఇంటి రుణానికి అవ‌స‌ర‌మైన అర్హ‌త‌లు వారు స‌మ‌కూర్చుకోవాలంటే ఒకింత క‌ష్ట‌మేన‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తూ ఉంటుంది. బ్యాంక‌ర్లు లేదా ఆర్థిక సంస్థ‌లు కూడా 70 ఏండ్ల వ‌య‌స్సు వ‌ర‌కు మాత్ర‌మే గ‌రిష్ఠంగా రుణ ప‌రిమితి (లోన్ టెన్యూర్‌)ని అనుమ‌తిస్తాయి.

ఈఎంఐ పెంపు.. రుణం త‌గ్గింపు..

ఒక‌వేళ మీరు 60 ఏండ్ల పైబ‌డిన సీనియ‌ర్ సిటిజ‌న్ అయితే, ఏదేనీ బ్యాంక‌ర్ గ‌రిష్ఠంగా ఇంటి రుణం చెల్లింపున‌కు 10 ఏండ్ల వ‌ర‌కూ మాత్ర‌మే గ‌డువు ఇస్తారు. అతి త‌క్కువ రుణ వాయిదాల చెల్లింపు పీరియ‌డ్ వ‌ల్ల రుణ గ్ర‌హీత త‌న రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపును పెంచుకోవ‌డం లేదా.. రుణం త‌గ్గించుకోవ‌డం గానీ చేస్తారు.

ప‌రిమితుల‌పై అవ‌గాహ‌న‌తోనే రుణం ల‌భ్య‌త ఈజీ

అర్హ‌త‌ల ప్ర‌మాణాల‌ను పూర్తి చేసేందుకు సిద్ద‌మైనా.. త‌మకు ఉన్న ప‌రిమితుల‌ను తెలుసుకుంటే త‌ప్ప సీనియ‌ర్ సిటిజ‌న్లకు ఇంటి రుణం ల‌భించ‌డం అంత తేలిక్కాదు. క‌నుక సీనియ‌ర్ సిటిజ‌న్లు రుణంపై ఇల్లు కొనుక్కోవాల‌నుకుంటే మాత్రం కొన్ని కీల‌క అంశాలు తెలుసుకోవాల్సిందే. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

వీరికి 10 ఏండ్లే పేమెంట్ పీరియ‌డ్

సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇంటి రుణం కోసం దర‌ఖాస్తు చేసుకోవాలంటే త‌మ వ‌య‌స్సును బ‌ట్టి ప‌దేండ్ల త‌క్కువ పేమెంట్ పీరియ‌డ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 40 ఏండ్ల వ‌య‌స్సు గ‌ల రుణ గ్ర‌హీత‌కు 70 ఏండ్ల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు గ‌రిష్ఠంగా 30 ఏండ్ల వ‌ర‌కు రుణ వాయిదాల (ఈఎంఐ) చెల్లించ‌డానికి ఆస్కార‌ముంటుంది.

30 ఏండ్ల‌లోపే ఈఎంఐ గ‌డువు..

సీనియ‌ర్ సిటిజ‌న్ల విష‌యానికి వ‌స్తే ఈఎంఐ చెల్లింపుల గ‌డువు 30 ఏండ్ల లోపు ఉంటుంది. తక్కువ గ‌డువులో రుణం చెల్లించాల్సి వ‌స్తే ఈఎంఐ సైజ్ పెరిగుతుంది. క‌నుక సీనియ‌ర్ సిటిజ‌న్లు త‌మ‌కు ఎంత రుణం అవ‌స‌ర‌మో జాగ్ర‌త్త‌గా నిర్ణ‌యించుకోవాలి. త‌క్కువ రుణ నిష్ప‌త్తిని ఎంచుకుంటే స‌ద‌రు వ్య‌క్తి దాఖ‌లు చేసిన ఇంటి రుణం ద‌ర‌ఖాస్తును బ్యాంక‌ర్లు ఆమోదిస్తారు.

ఎల్టీఎంతో త‌క్కువ ఈఎంఐ ఖ‌రారు

త‌క్కువ లోన్ టెన్యూర్ వాల్యూ (ఎల్టీఎం) అంటే త‌క్కువ ఈఎంఐ ఖ‌రార‌వుతుంది. ఇటువంటి వారికే ఒక బ్యాంక‌ర్ నుంచి ఇంటి రుణ ద‌ర‌ఖాస్తుకు ఆమోద‌ముద్ర ల‌భిస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ సొంత ఆదాయ వ‌న‌రుల నుంచి ఇంటి విలువ చెల్లింపున‌కు మొగ్గితే, త‌క్కువ రుణం బ్యాంక్ నుంచి ల‌భిస్తుంది.

ఎమ‌ర్జెన్సీ ఫండ్‌పై రాజీ ప‌డొద్దు

క‌నుక త‌గినంత ఎమ‌ర్జెన్సీ ఫండ్ నిర్వ‌హించుకోవ‌డం వంటి అంశాల‌పై సీనియ‌ర్ సిటిజ‌న్లు రాజీ ప‌డొద్ద‌ని నిపుణులు సూచిస్తున్నారు. ప్ర‌త్యేకించి త‌క్కువ విలువ గ‌ల ఆస్తి కొనుగోలుకు మొగ్గు చూపితే వారిపై నెల‌వారీ రుణ వాయిదా (ఈఎంఐ) భారం త‌గ్గుతుంది.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్‌ ఈజీ..

కుటుంబ స‌భ్యుల కో-అప్లికెంట్‌తో ప్ర‌యోజ‌నాలివి..

త‌క్కువ రీపేమెంట్ టెన్యూర్ వ‌ల్ల చాలా మంది సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇంటి రుణం కోసం బ్యాంక‌ర్ల నిబంధ‌న‌ల‌ను పూర్తి చేయ‌డం క‌ష్ట సాధ్యం అ‌వుతుంది. ఈ త‌రుణంలో ఇంటి రుణ అర్హ‌త‌ల‌ను సంపాదించుకోవాలంటే వారు త‌మ‌తోపాటు కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రిని స‌హ రుణ ద‌ర‌ఖాస్తు దారుగా చేర్చాలి.అలా కుటుంబ స‌భ్యుల‌ను కో-అప్లికెంట్‌గా చేర్చ‌డంతో ఇంటి రుణం పొంద‌డానికి మార్గాలు మెరుగ‌వుతాయి. అలాగే తీసుకునే రుణం విలువ కూడా పెరుగుతుంది.

పాత రుణాలు క్లియ‌ర్ చేసుకుంటే ఇలా ఈజీ

సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇంటి రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి ముందే అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రుణాల చెల్లింపులు పూర్తిగా క్లియ‌ర్ చేసుకోవ‌డం ఉత్త‌మంగా ఉంటుంది. ఇత‌ర రుణాలు తీసుకుని ఉంటే, బ్యాంక‌ర్ మీ రీపేమెంట్ కెపాసిటీని చెక్ చేస్తారు.

రుణ వాయిదాల పెరుగుద‌ల‌తో స‌మ‌స్య‌లిలా

అప్ప‌టికే తీసుకున్న రుణాల‌కు వాయిదాలు చెల్లిస్తుండ‌టం వ‌ల్ల సీనియ‌ర్ సిటిజ‌న్ల‌ నెల‌వారీ ఆదాయం త‌గ్గిపోతుంది. ఒక‌టి, రెండు రుణ వాయిదాలు ఉన్నా.. ఇంటి రుణం అర్హ‌త త‌గ్గుతుంది. ఇప్ప‌టికే ఉన్న రుణ చెల్లింపులు పూర్తి చేసుకుంటే.. మీ ఇంటిరుణ అర్హ‌త‌లు మెరుగ‌వుతాయి.

మంచి క్రెడిట్ స్కోర్ మెయింటెన్ చేయాలిలా

ఇంటి రుణం తీసుకోవాలంటే గుడ్ క్రెడిట్ స్కోర్ కొన‌సాగించ‌డం కీల‌కంగా మారుతుంది. ఒక‌వేళ చాలా త‌క్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే, రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌రించ‌డ‌మో, అధిక వ‌డ్డీరేటు ఖ‌రారు చేయ‌డానికో బ్యాంక‌ర్లు ప్రాధాన్యం ఇస్తుంటారు. క‌నుక ఇంటి రుణం తీసుకోవాల‌ని అభిల‌షించే వారు త‌మ క్రెడిట్ స్కోర్ 750 పాయింట్ల పై చిలుకు ఉండేలా చూసుకోవాలి.

నిర్మాణం పూర్త‌యిన ఇంటినే కొనుక్కోవాలి

నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే, ఇంటి రుణ వాయిదాతోపాటు అద్దె చెల్లింపులు స‌మ‌స్య‌గా మార‌తాయి. స‌కాలంలో బిల్డ‌ర్ ఇంటిని మీకు అప్ప‌గించ‌క‌పోతే మ‌రికొన్ని స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి వ‌స్తుంది. క‌నుక అమ్మ‌కానికి సిద్ధంగా ఉన్న ఇంటి కొనుగోలుకే సీనియ‌ర్ సిటిజ‌న్లు ప్రాధాన్యం ఇవ్వ‌డం మంచిద‌ని బ్యాంక‌ర్లు సూచిస్తున్నారు. యోగా సెంట‌ర్లు, మెడిక‌ల్ ఫెసిలిటీ, రోడ్డు, బ‌స్టాప్, మెట్రో స్టేష‌న్ల‌కు స‌మీపంలోని ఇండ్ల కొనుగోలుకు మొగ్గు చూపితే బెట‌ర్ అన్న అభిప్రాయం వినిపిస్తున్న‌ది.

స‌వాళ్లు ఉన్నా ఆర్థిక ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోవాలి

స‌వాళ్లు ఎదురైనా సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవాలంటే సీనియ‌ర్ సిటిజ‌న్లు స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక వేసుకోవాలి. ఇల్లు కొనుగోలుకు త‌మ రిటైర్మెంట్ కార్ఫ‌స్ ఫండ్ ఎంత వ‌స్తుంద‌న్న విష‌య‌మై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉంటే రోజువారీ అవ‌స‌రాలతోపాటు అత్య‌వ‌స‌రాల‌పై ప్ర‌భావం ప‌డ‌ద‌ని బ్యాంక‌ర్లు, నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చ‌దవండి:

ఆండ్రాయిడ్ యూజ‌ర్లూ.. సిస్ట‌మ్ అప్‌డేట్‌తో జాగ్ర‌త్త

ధావన్‌, పంత్‌, హార్దిక్ మెరుపులు‌..భారత్‌ 329 ఆలౌట్‌

టయోటా కార్లు ప్రియం ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ధరలు

ఆదానీ చేతికి క‌ర్నూల్-వ‌రోరా ట్రాన్సిమిష‌న్‌!

ఇక మెడిక‌ల్‌, డిజ‌ట‌ల్ స‌హా ప‌లు రంగాల్లోకి టాటా విస్త‌ర‌ణ‌

ఇల్లు కొనే వారికి అద్భుత అవ‌కాశం.. సీఎల్ఎస్ఎస్ స‌బ్సిడీలివే..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్‌ ఈజీ..

ట్రెండింగ్‌

Advertisement