ఆదానీ చేతికి కర్నూల్-వరోరా ట్రాన్సిమిషన్!

అహ్మదాబాద్: వరోరా-కర్నూల్ ట్రాన్సిమిషన్ లిమిటెడ్ (డబ్ల్యూకేటీఎల్) సంస్థను ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్టును టేకోవర్ చేసుకోనున్నట్లు ఆదానీ ట్రాన్సిమిషన్ లిమిటెడ్ (ఏటీఎల్) శనివారం తెలిపింది. ఈ మేరకు ఎస్సెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో టేకోవర్ ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు పేర్కొంది.
ఈ డీల్ విలువ రూ. 3,370 కోట్లు ఉంటుందని తెలుస్తున్నది. ఇప్పటికే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందామని ఏటీఎల్ వెల్లడించింది. ఎస్సెల్, ఆదానీ గ్రూపుల మధ్య జరిగిన ఈ ఒప్పందానికి బ్యాంకులు, రెగ్యులేటరీ సంస్థల ఆమోదం తప్పనిసరి కావాల్సి ఉంది.
ఈ ఒప్పందంపై ఏటీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవో అనిల్ సర్దానా స్పందిస్తూ.. పశ్చిమం నుంచి దక్షిణానికి ఈ ట్రాన్సిమిషన్ కంపెనీ వ్యూహాత్మకంగా కీలకం అని పేర్కొన్నారు. 765 కేవీ ఇంటర్ కనెక్టర్‌తో దక్షిణభారతావనితో అనుసంధానిస్తుందన్నారు. ఈ కంపెనీని టేకోవర్ చేయడంతో దేశంలోని అన్ని రీజియన్లలో విద్యుత్ సేవలకు తమ సంస్థకు ప్రాతినిధ్యం లభించినట్లైందన్నారు.
ఈ సంస్థను టేకోవర్ చేయడంతో ఏటీఎల్ కంపెనీ మరిత బలోపేతం కావడంతోపాటు 20 వేల సీకేటీ కిలోమీటర్ల దూరం వరకు ట్రాన్సిమిషన్ లైన్ల నిర్మాణానికి లక్ష్యాలు ఖరారయ్యాయని అనిల్ సర్దానా పేర్కొన్నారు. 2022 నాటికి ఈ ట్రాన్సిమిషన్ లైన్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు.
వరోరా- కర్నూల్ ట్రాన్సిమిషన్ కంపెనీ 1750 సీకేటీ కిలోమీటర్ల మేరకు ట్రాన్సిమిషన్ లైన్లను అభివ్రుద్ధి చేసి నిర్వహించాల్సి ఉంటుంది. 765 కేవీ ఇంటర్ స్టేట్ ట్రాన్సిమిషన్ లైన్.. వరోరా-వరంగల్, చిలకలూరి పేట-హైదరాబాద్-కర్నూల్ లైన్లను అనుసంధానిస్తుంది.
ఇవి కూడా చదవండి:
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
మీడియా, వినోద రంగం కోలుకున్నట్టే
పీఎంసీ బ్యాంకులో జూన్ వరకూ ఆంక్షలు.. ఎందుకంటే..
ప్రభుత్వ బ్యాంకులకే మొండి బాకీల సమస్య!
చౌకగా ఇచ్చే వారివద్దే చమురు కొనుగోలు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

