Water Trough | తాండూరు రూరల్, ఏఫ్రిల్ 13 : వేసవిలో మూగజీవాలకు నీరు దొరకడం ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఎండలో పశువుల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్టి వృధాగా మారిపోయింది.
తాండూరు మండలం పర్వతాపూర్ గ్రామంలో నిర్మించిన పశువుల నీటి తొట్టిని అధికారులు పట్టించుకోవడం లేదు. వేసవిలో నీటి తొట్టిలను అందుబాటులోకి తీసుకు వస్తే, పశువులకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. నిర్మించిన నాటి నుంచి నీటి తొట్టీల్లోకి నీళ్లు వదలడంలేదని గ్రామస్తులు అంటున్నారు.
అధికారులు ఇప్పటికైనా వేసవిని దృష్టిలో పెట్టుకుని మూగజీవాలకు ఇబ్బందులు రాకుండా పశువుల నీటితొట్టిని అందుబాటులోకి తీసురావాలని కోరుతున్నారు.
Rollavagu project | రోళ్లవాగు ప్రాజెక్ట్ కు గేట్లు బిగించక వృథాగా పోతున్న నీరు
IPL 2025 | సెంచరీ హీరో అభిషేక్ శర్మకు వెల్లువెత్తిన అభినందనలు.. గురువు యువరాజ్ ఏమన్నాడంటే..?
Pawan Kalyan | హైదరాబాద్కి వచ్చాక తొలిసారి కొడుకు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్