IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్ 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తుఫాను ఇన్నింగ్స్‌తో అలరించింది. పంజాబ్ కింగ్స్‌పై ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోర్‌ను ఛేజ్ చేసింది. పంజాబ్ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరింది. ఈ విజయంలో అభిషేక్ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, పది సిక్సర్ల సహాయంతో 141 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరో వైపు మాజీ క్రికెటర్ల సైతం అభినందించారు. అభిషేక్ గురువు యువరాజ్ సింగ్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ సైతం అభిషేక్ ఇన్నింగ్స్‌ను అద్భుతమంటూ అభినందనలు తెలిపారు.
Ipl
యువరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో అభిషేక్‌ను అభినందించాడు. వావ్ శర్మ జీ కొడుకు 98 పరుగుల వద్ద సింగిల్.. మళ్లీ 99 పరుగుల వద్ద సింగిల్. ఇంత మెచ్యూరిటీని భరించలేకపోతున్నాను. గొప్పగా మ్యాచ్ ఆడాడని.. ట్రావిస్ హెడ్ సైతం బాగా ఆడాడని.. ఇద్దరు ఓపెనర్స్ ఆడడం చూసి కనుల పండువగా ఉందని తెలిపాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను సైతం ప్రశంసించాడు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. అభిషేక్ చేతివేగం అద్భుతమైందని.. బంతిని మైళ్లదూరం పంపేందుకు అతను తన చేతులను బంతి కిందకి తీసుకునే విధానం చూడదగిందని.. ఇదో గొప్ప ఇన్సింగ్.. ఇలాగే కొనసాగించూ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తెలుగు ప్లేయర్ నితీశ్‌రెడ్డి.. అభిషేక్ ఇన్నింగ్స్‌ను ‘మాస్’గా పేర్కొన్నాడు.
Ipl
మ్యాచ్ గెలిచినందుకు అమ్మ సంతోషంగా ఉందంటూ సూర్యకుమార్ వీడియోను షేర్ చేశాడు. ‘మా జీ నే బోలా దియా తో బోలా దియా బాస్’ అంటూ సూర్యకుమార్ వీడియోను పోస్ట్ చేశాడు. ఇక సన్‌రైజర్స్ అభిమానులు హైదరాబాద్ జట్టును ఆరెంజ్ ఆర్మీగా పిలుస్తుంటారు. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, పాట్ కమ్మిన్స్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ తర్వాత, అభిషేక్ శర్మ కూడా హైదరాబాద్ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అభిషేక్ తన ఇన్నింగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. మ్యాచ్ తర్వాత ఆయన మాట్లాడుతూ ఏ ఆటగాడికీ ఆ ఫామ్‌ను దాటడం అంత సులభం కాదని తెలిపాడు. ఈ మ్యాచ్ హెడ్‌కి, తనకీ ఇద్దరికి ప్రత్యేకమైందని చెప్పాడు. జట్టును పరాజయాల నుంచి బయటపడేలా చూడాలని అనుకున్నానని తెలిపాడు.
Ipl