కులకచర్ల, మే 19 : వాహన దారులు తప్పని సరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కులకచర్ల ఎస్ఐ రమేశ్ అన్నారు. సోమవారం కులకచర్ల పోలీస్టేషన్ దగ్గర రోడ్డుపైన వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహణ కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను వాహనదారులు తప్పని సరిగా పాటించాలని సూచించారు.
బైక్ నడిపేవారు హెల్మెట్‌ను ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదన్నారు. అలాగే కారు నడిపేవారు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మధ్యం సేవించి వాహనాలు నడుపొద్దని సూచించారు. ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్దంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Spying | పాకిస్థాన్ కోసం గూఢచర్యం.. నుహ్‌లో మరో వ్యక్తి అరెస్ట్