Shilpa Shirodkar | ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ఆసియావ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్‌లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ సైతం కొవిడ్ పాజిటివ్‌గా తేలారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో సూచించారు. టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు భార్య నమత్రా శిరోద్కార్ సోదరియే శిల్పా శిరోద్కర్. కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని శిల్పా శిరోద్కర్ వెల్లడించిన నేపథ్యంలో బాలీవుడ్‌ను షాక్‌కు గురి చేస్తుంది. పలువురు అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా.. శిల్పా శిరోద్కర్ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు.
టీవీ సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. ఇటీవల రియాలిటీ షో బిగ్ బాస్ 18లో పాల్గొంది. గ్రాండ్ఫినాలే వీక్‌లో ఎనిమిలేట్ అయ్యింది. ఫైనలిస్ట్ అయ్యే అవకాశం త్రుటిలో చేజారింది. బిగ్‌బాస్‌తో శిల్పా లపు ప్రాజెక్టులు, ఎండార్స్మెంట్లతో ఫుల్ బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా.. గత కొద్దికాలంగా కొవిడ్ మహమ్మారితో జనమంతా ఊపిరిపీల్చుకుంటుండగా.. ప్రస్తుతం మళ్లీ విజృంభిస్తున్నది. ఇంతకు ముందు ఆస్ట్రేలియాకు చెందిన బ్యాటర్ ట్రావిస్ హెడ్ సైతం కొవిడ్ బారినపడ్డ విషయం తెలిసిందే. వరుసగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనమంతా ఆందోళనకు గురవుతున్నారు. అయితే, కొవిడ్‌తో పెద్దగా ఇబ్బంది లేదని.. సాధారణంగా ఫ్లూ మాదిరిగానే సోకుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. టీకా ప్రభావం తగ్గిన నేపథ్యంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.. తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.