వరంగల్, ఫిబ్రవరి 28 : ఓరుగల్లు గడ్డపై తొలిసారిగా నిట్, కాకతీయ పట్టణాభివృది సంస్థ (కుడా) సహకారంతో చేసిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. వరంగల్ భద్రకాళీ బండ్‌పై చేసిన రుద్రమ -1 రాకెట్ లాంచ్ నింగిలోకి ఎగిరిన క్షణాల్లోనే నేల కూలింది.
నాలుగు అడుగుల ఎత్తుతో 250 గ్రాముల బరువు కలిగిన రెండు రాకెట్లు ప్రయోగించినా ఏ ఒక్కటీ విజయవంతం కాలేదు. రాకెట్ లాంచ్ వీక్షించేందుకు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ భద్రకాళీ బండ్‌కు వచ్చారు.