హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం కోసం వెంటనే ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంతోపాటు తమ న్యాయమైన ఇతర డిమాండ్లను పరిషరించాలని బీఎంఎస్ అనుబంధ సంస్థ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వరర్స్ ఆర్గనైజేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం కార్మిక శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ రవిశంకర్, జనరల్ సెక్రటరీ ఎం సంతోష్, డబ్ల్యూకేజీ అధ్యక్షుడు పీ ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ.. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చట్టాన్ని చేసినప్పటికీ దాని అమలుకు కీలకమైన బోర్డు నిర్మాణం ఇంతవరకు జరుగలేదని, దీంతో లక్షల మంది ఆటో, క్యాబ్, డెలివరీ, ఇతర గిగ్ కార్మికులు సంక్షేమ ఫలాలను పొందలేకపోతున్నారని చెప్పారు.