హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 28 : హనుమకొండలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో రెండు రోజులుగా జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ శనివారం ముగిసింది. చివరి రోజు నిర్వహించిన ఈవెంట్లు విద్యార్థుల్లో జోష్ నింపాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ స్టంట్ షో ఆకట్టుకుంది. వీల్ బ్యాలెన్సింగ్, సమూహ కదలికలు, కచ్చితమైన నియంత్రణతో చేసిన ప్రదర్శనలు ఉత్సాహపరిచాయి. ‘మీడియా క్లబ్ డిటెక్టివ్’ కార్యక్రమం ఆసక్తికరంగా నిలిచింది.
ఇందులో పాల్గొన్న విద్యార్థులు గూఢ సూచనలు విశ్లేషించడం, వీడియో, చిత్ర ఆధారిత ఆధారాలను పరిశీలించడం, కథన రూపంలో ఇచ్చిన మిస్టరీలను పరిషరించడం, సమయపాలన, జట్టు సహకారంతో సమస్యలను ఛేదించడం, క్రైమ్-సీన్ సిమ్యులేషన్ జట్టు సమన్వయాన్ని పరీక్షించింది. అలాగే ఓపెన్ మైక్ (హిందీ) కవిత్వం, సాహిత్య ప్రదర్శనలు, ట్రెజర్ హంట్, పర్యావరణపై అవగాహన, ఐడోల్ గాన, నృత్య పోటీలు, మాక్ పార్లమెంట్ చర్చా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ గాయని రణినారెడ్డి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనంతరం జరిగిన కొరియో నైట్లో విద్యార్థి బృందాల డాన్స్లు అలరించాయి.