Spying | పాకిస్థాన్ కోసం గూఢచర్యం (Spying For Pak) చేస్తున్న పలువురు భారతీయుల్ని అధికారులు గుర్తించి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే హర్యానా, పంజాబ్, యూపీలో దాదాపు ఎనిమిది మంది గుఢచారులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరెస్టైన వారిలో విద్యార్థి, యూట్యూబర్, వ్యాపారవేత్త, గార్డ్ తదితరులు ఉన్నారు. తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
హర్యానాలోని నుహ్ (Nuh)లో ఓ అనుమానితుడిని అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడు మేవాట్ జిల్లా టౌరు తహసీల్‌లోని కంగర్కా గ్రామానికి చెందిన మహ్మద్ తారీఫ్గా గుర్తించారు. అతడు పాక్ ఏజెంట్లకు భారత సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించారు. కాగా, నుహ్‌లో ఇప్పటికే ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రజక గ్రామానికి చెందని అర్మాన్‌ను గూఢచర్యం ఆరోపణలపై రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు.
కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది మంది అనుమానితుల్ని అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టైన వారిలో గజాలా (పంజాబ్), యాసీన్ మొహమ్మద్, నోమాన్ ఇలాహి (యుపీ), 26ఏళ్ల అర్మాన్ (నుహ్), 25 ఏళ్ల దేవేంద్ర సింగ్ ధిల్లాన్ (కైతాల్), మహమ్మద్ ముర్తజా అలీ (జలంధర్), జ్యోతి మల్హోత్రా (హర్యానా యూట్యూబర్), షహజాద్ (యుపీ మొరాదాబాద్) ఉన్నారు. తాజా అరెస్ట్‌తో తొమ్మిది మంది గూఢచారులను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లైంది. వీరంతా పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Spying For Pak | పాకిస్థాన్ కోసం గూఢచర్యం.. యూపీ వ్యాపారి అరెస్ట్
Jyoti Malhotra | పాక్ గూఢచారి జ్యోతితో ఒడిశా యూట్యూబర్‌కు లింకులు?