Jyoti Malhotra | ఉగ్ర దాడికి ముందు పహల్గాంను సందర్శించి.. వీడియోలు తీసి.. యూట్యూబర్ జ్యోతి కేసులో విస్తుపోయే విషయాలు
Jyoti Malhotra | గూఢచర్యం (spying) కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.
Jyoti Malhotra | గూఢచర్యం (spying) కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు అక్కడ వీడియోలు తీసినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఆ వీడియోలను పాక్ ఏజెంట్ల (Pak Agents)తో పంచుకున్నట్లు భావిస్తున్నారు. దీనిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పాకిస్థాన్‌కు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)ను అధికారులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో జ్యోతి మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి దాదాపు మూడు నెలల ముందు ఆమె తరచూ జమ్ము కశ్మీర్లో పర్యటించినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఒకసారి చైనాకు కూడా వెళ్లొచ్చినట్లు తేలింది. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు అధికారులు నిర్ధరించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు.
ట్రావెల్ వ్లాగర్ జ్యోతి.. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందిన జ్యోతి 2023లో పాక్‌ను సందర్శించింది. ఆమె ఎవరికీ అనుమానం రాకుండా పాక్ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్‌తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మన దేశంలోని కీలక ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌తో పంచుకున్నట్లు తేలింది.
అంతేకాదు ఓ పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు కూడా తేలింది. అతడితో ఆమె అంతర్జాతీయ ట్రిప్‌కు కూడా వెళ్లింది. ఇండోనేషియాలోని బాలికి విహారయాత్రకు వెళ్లి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. జ్యోతిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఇక దర్యాప్తులో తాను తప్పు చేసినట్లు జ్యోతి రాతపూర్వకంగా అంగీకరించినట్లు సమాచారం. జ్యోతితోపాటు మరో ఐదుగురి గుట్టును కూడా అధికారులు బయటపెట్టారు. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read..
“Jyoti Malhotra | పాక్ గూఢచారి జ్యోతితో ఒడిశా యూట్యూబర్‌కు లింకులు?”
“Jyoti Malhotra | రెండేండ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జ్యోతి మల్హోత్రా.. వీడియో”
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

