Jyoti Malhotra | పూరి: గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో ఒడిశాలోని పూరిలో ఉన్న ఓ యూట్యూబర్‌కు సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూరి ఎస్పీ వినీత్ కథనం ప్రకారం, ‘ట్రావెల్ విత్ జో’ యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్న జ్యోతి నిరుడు సెప్టెంబరులో పూరి వచ్చి, ఓ మహిళా యూట్యూబర్‌ను కలిసింది.
పూరి మహిళ కూడా పాకిస్థానీ నిఘా వర్గాలకు మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇచ్చిందా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతిని పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు ఒక అస్త్రంగా మలచుకున్నారని హర్యానా పోలీసులు గుర్తించారు.