Harish Rao | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కోహీర్ మండలం దిగ్వాల్ సబ్‌స్టేషన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. సబ్‌స్టేషన్‌లో లాగ్ బుక్స్‌ను పరిశీలించి కరెంటు సరఫరాపై అధికారులను ఆరా తీశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ రోజు మండలం దిగ్వాల్ సబ్‌స్టేషన్‌కు ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. గత కొద్దిరోజులుగా రైతులు ఎమ్మెల్యే మాణిక్‌రావుకు, నాకు కూడా ఫోన్ చేసి కోహిర్లో విద్యుత్ సరఫరా బాగాలేదు. రోజుకు 5–6 సార్లు కరెంట్ ట్రిప్ అవుతుంది. రైతులకు వ్యవసాయానికి కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. ఆ ఇచ్చిన 12 గంటల కరెంట్ నాలుగు సార్లు ట్రిప్ అవుతుందని వార్తలు పత్రికల్లో కూడా వచ్చాయి. రైతులు మాకు కూడా ఫోన్ చేసి చెబుతున్నారు.
ఈరోజు అకస్మాత్తు తనిఖీల్లో దిగ్వాల్ 33/11 కెవి సబ్‌స్టేషన్‌కు రావడం జరిగింది. ఇప్పుడే లాగ్‌బుక్ చూశాము. 10వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు త్రీఫేస్ కరెంట్ తీసేశారు. మళ్లీ 11వ తారీఖు ఎప్పుడు వచ్చిందంటే ఉదయం 3 గంటలకు త్రీఫేస్ కరెంట్ వచ్చింది. అంటే దాదాపు 11 గంటలు కరెంట్ తీసేశారు రైతులకు. ఇది నేను చెబుతున్నది కాదు, స్వయంగా మీ లాగ్‌బుక్ చెబుతున్న వివరాల ప్రకారం మిగతా 13 గంటలు చూస్తే ఎల్సి ఉన్నది, లైన్ బ్రేక్ అయిందంటున్నారు. అట్లా మళ్లీ ఐదుసార్లు పోతుంది. ఆ ఇచ్చిన 13 గంటల్లో కూడా కనీసం రోజుకు ఐదుసార్లు ట్రిప్ అవుతుంది. దానివల్ల పారని మడే పారుతుంది. వెనుక మడికి నీళ్లు అందని పరిస్థితి వస్తుందని రైతులు చాలా బాధపడుతున్నారు హరీష్ రావు.
రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలోనేమో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారు. మరి ఎక్కడ ఉంది 24 గంటల కరెంట్..? లాగ్‌బుక్‌లో చూస్తే 13 గంటలు. మధ్యలో ఉన్న ఎల్సి, లైన్ బ్రేక్, ట్రిప్పులు ఇవన్నీ తీసేస్తే 12 గంటలు కరెంట్ కూడా రైతులకు రావడం లేదు. ఆ ఇచ్చిన 12 గంటల కరెంట్ నాలుగు సార్లు రైతులకు ట్రిప్ అవుతుంది. మాటల్లో 24 గంటలు, చేతల్లో వస్తుంది 12 గంటల కరెంట్ మాత్రమే. రేవంత్ రెడ్డి నీకు రైతులంటే ఎందుకు అంత చిన్నచూపు..? ఆనాడు కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ వస్తే, ఇవాళ కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. ఇవాళ నువ్వు రైతులకు ఏం చేశావు..? రైతులకు రైతుబంధు ఎగ్గొట్టినవ్, పంటల బీమా, ఆత్మీయ భరోసా కొట్టినవ్, బోనస్ పోయిన యాసంగికి ఇవ్వలేదు. రైతులకు కరెంట్ సరిగ్గా ఇవ్వడం లేదు.
ఇప్పటివరకు రైతుబంధు పడలేదు..
రైతుల్ని ఇవాళ ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తున్నావు రేవంత్ రెడ్డి..? అని హరీష్ రావు ప్రశ్నించారు.ఇవాళ స్పష్టంగా దిగ్వాల్ సబ్‌స్టేషన్‌లో చూస్తే రైతులకు 12 గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. ఇప్పటివరకు రైతుబంధు పడలేదు. పోయిన యాసంగి పంటలకు లేదు. వరంగల్‌లో వాన పరిహారం కూడా రెండు సంవత్సరాలుగా రావడం లేదు. రైతుల మీద ఎందుకు ఇంత చిన్నచూపు రేవంత్ రెడ్డి..? రైతుల మీద ఎందుకు ఇంత పగ..?డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క .. మీరు విద్యుత్ శాఖ మంత్రిగా అసెంబ్లీలో 24 గంటలు ఇస్తున్నామని చెప్పడం కాదు. సబ్‌స్టేషన్‌లో ఉండి మా గౌరవ ఎమ్మెల్యేలతో కలిసి ఆకస్మిక తనిఖీ చేస్తే 12 గంటలకు మాత్రమే వస్తుంది.
బాధ కలిగించే అంశం ఏంటంటే, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కేసీఆర్ ఉన్నప్పుడు రూ.4900కు వ్యవసాయ కనెక్షన్ ఇచ్చేవారు. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డబుల్ రూ. 9700 చేశారు. ఆరోజు రూ.4900కి కనెక్షన్ ఇస్తే ఈరోజు రూ.9700 ఎందుకు చేశారు..?నువ్వు తగ్గిస్తావా..? పెంచుతావా..? మాటల్లో రైతు ప్రభుత్వం, చేతల్లో రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈరోజు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కొత్త కలెక్షన్లకు డబుల్ ఫీజు పెంచినవు.
రాష్ట్రవ్యాప్తంగా వేలాది విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కనెక్షన్లు రిలీజ్ చేయడంలో కూడా ఆలస్యం జరుగుతుంది. స్టోర్‌లో మెటీరియల్ లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు రైతుల మీదనే భారం పడుతుంది. వెంటనే ట్రాన్స్ఫార్మర్లు మార్చడం లేదు. లో వోల్టేజ్ ఉన్నచోట అదనపు డీటీఆర్ పెట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. దిగ్వాల్ సబ్‌స్టేషన్ నుండి డిమాండ్ చేస్తున్నాం. దమ్ముంటే 24 గంటల కరెంట్ ఇవ్వండి. లేదంటే చెంపలు వేసుకుని తప్పు అయిందని, మేము 24 గంటల కరెంట్ ఇవ్వలేము, 12 గంటలే ఇస్తాం అని చెప్పండి.
నిజంగా 24 గంటలు కరెంట్ ఇచ్చేది ఉంటే రేపటి నుంచి రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలని రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు. ఎన్నికల ముందు మోసమే, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మోసమే.మూడో డిస్కం పెట్టింది ఎందుకంటే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో కొత్త అప్పుల కోసం ఉన్న బకాయిలన్నీ థర్డ్ డిస్కంకు ట్రాన్స్ఫర్ చేసి, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో అప్పు లేదని చూపించి మళ్లీ కొత్త అప్పులు తెచ్చే నాటకం ఆడుతున్నారు.డిస్కం ఎలా పనిచేస్తుంది అంటే.. ఒక గ్రామం ఉంటే అందులో ఇండ్లు ఒక ఏఈ, వ్యవసాయ బావులు ఒక ఏఈ, ఇది ప్రాక్టికల్‌గా జరిగే పని కాదు. కేవలం బ్యాంకులను, ఫైనాన్స్ కంపెనీలను మోసపుచ్చడానికి ఈ డిస్కం ఏర్పాటు చేశారు.ఇప్పటికే మీరు డిస్కంలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. 55 వేల కోట్లు డిస్కంలు అప్పుల్లో ఉన్నాయి.దేశంలో ఎక్కడా లేని విధంగా డిస్కంలకు ఉచిత విద్యుత్ గానీ, 200 యూనిట్ల గానీ ప్రభుత్వం చెల్లించడం లేదు.6 నెలల నుండి కొత్త మీటర్లు ఇవ్వడం లేదన్నారు.
ఆర్టిజెన్స్ను రెగ్యులర్ చేయాలి..
రాష్ట్రవ్యాప్తంగా 19,647 మంది ఆర్టిజెన్స్ సమ్మె చేస్తున్నారు. వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. చనిపోయిన ఆర్టిజెన్స్ పిల్లలకు వారి విద్యా అర్హతల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్పీడీసీఎల్లో అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ రావడం లేదు. వస్తున్నది కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే నర్సాపూర్, మెదక్ సబ్‌స్టేషన్‌లో కూడా 12 గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తాలూకా కోహిర్ మండలం దిగ్వాల్ సబ్‌స్టేషన్‌లో కూడా 12 గంటల కరెంట్ మాత్రమే వస్తోంది.
ఎందుకు రైతులంటే నీకు చిన్నచూపు..? ఏ విషయంలో కూడా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలో రైతుబంధు బరాబర్ ఇచ్చాం. కరోనా సమయంలో కూడా ఇచ్చాం. పెద్ద నోట్ల రద్దు సమయంలో కూడా ఇచ్చాం. కానీ రేవంత్ రెడ్డి నువ్వు రైతులను మోసం చేశావు, రైతులను దగా చేశావన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదల చేయాలి, ఇండ్లకు డబ్బులు కట్టిన వారికి వెంటనే మీటర్లు పెట్టాలి, రైతుబంధు వెంటనే విడుదల చేయాలి, ఆర్టిజెన్స్ అందరినీ రెగ్యులర్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం డిగ్వాల్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీలు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
సబ్‌స్టేషన్‌లో లాగ్ బుక్స్‌ను పరిశీలించి, కనీసం 12 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని ప్రభుత్వం మండిపడ్డ హరీష్ రావు
కరెంటు సరఫరాపై అధికారులతో ఆరా
కాంగ్రెస్… pic.twitter.com/qjh3Mrt4ig
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2026
Dhurandhar | సీక్వెల్ రిలీజ్ ముందు సంచలనం.. 500 స్క్రీన్లలో రీ-రిలీజ్‌కి సిద్ధమైన దురంధర్ చిత్రం
Anurag Kashyap | ఎప్స్టీన్ ఫైల్స్‌తో నాకు సంబంధం లేదు: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్
Yami Gautam | ఆదిత్య ధర్ బర్త్‌డే.. భర్తపై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన యామీ గౌతమ్!