Kim Jong Un : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ తన దేశంలో ఆయుధాలు పెంచుకోవడంపై దృష్టిపెట్టాడు. తాజాగా అధునాతన లైట్ పిస్టల్స్ తయారు చేశాడు. ఈ మేరకు పిస్టల్స్ ఫ్యాక్టరీలో కొత్తగా తయారు చేసిన ఆయుధాల్ని కిమ్ పరీక్షించాడు. ఆయనతోపాటు అతడి కూతురు కిమ్ జు అయే కూడా ఈ టెస్టింగ్‌లో పాల్గొంది. కిమ్, అతడి కూతురు కిమ్ జు ఇద్దరూ పిస్టల్స్ పరీక్షించారు. ఈ పిస్టల్స్‌ను అధ్యక్షుడు కిమ్ పరీక్షించి, అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.
అలాగే ఇతర కొన్ని చిన్న ఆయుధాల్ని కూడా ఆయన పరీక్షించారు. ఇంతకాలం అణ్వాయుధాలపై దృష్టిపెట్టిన కిమ్.. ఇప్పుడు స్వల్ప, మధ్యస్థాయి ఆయుధాల తయారీపై దృష్టిసారించాడు. ఆధునిక ఆయుధాల్ని తయారు చేయాలని ఆయన నిర్ణయించాడు. అందువల్ల పిస్టల్స్ వంటివి తయారు చేయిస్తున్నాడు. ఉత్తర కొరియా సైన్యానికి ఈ ఫ్యాక్టరీ తయారు చేసే ఆయుధాలు ఎంతో కీలకం అని కిమ్ అన్నట్లు అక్కడి మీడియా తెలిపింది. ఇక కూతరు కిమ్ జో కూడా తండ్రితోపాటు పిస్టల్స్‌ను పరీక్షించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా విడుదలయ్యాయి. కిమ్ కూతురు పేరు అధికారికంగా వెల్లడి కాకపోయినా, తన పేరు కిమ్ జు అయే అని తెలుస్తోంది.
ప్రస్తుతం కిమ్ జు వయసు 13. కిమ్ తర్వాత ఉత్తర కొరియాకు నాయకత్వం వహించబోయేది తనేనని అక్కడి ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 2022లో ఉత్తర కొరియా జరిపిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్ పరీక్ష సందర్భంగా కిమ్ కూతురు తొలిసారి పబ్లిక్‌గా కనిపించింది. ఆ తర్వాత అప్పుడప్పుడూ అధికారిక కార్యక్రమాల సందర్భంగా కనిపించింది. ఇక.. ఇటీవల తరచూ వార్తల్లో కనిపిస్తోంది. గత నెలలో కూడా ఒక స్నైపర్ గన్ కాల్చడాన్ని కిమ్ జు ప్రాక్టీస్ చేసింది. కిమ్ వారసురాలిగా ఆమెను భావిస్తున్నారు.