MS Dhoni | ధోనీకి లైన్ క్లియర్.. కేసు కొట్టేసిన బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్..!
MS Dhoni : ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందే మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి భారీ ఊరట లభించింది. పరస్పర విరుద్ద ప్రయోజనాలు(Conflict Of Interest) పొందుతున్నారని అతడిపై వచ్చిన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ తోసిపుచ్చారు.
MS Dhoni : ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందే మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి భారీ ఊరట లభించింది. పరస్పర విరుద్ద ప్రయోజనాలు(Conflict Of Interest) పొందుతున్నారని అతడిపై వచ్చిన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ తోసిపుచ్చారు. దాంతో.. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తరఫున మరోసారి తన మ్యాజిక్ చూపించేందుకు తాలా సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే నెట్స్‌లో సాధన చేస్తున్న మహీ భాయ్.. కేసు కొట్టివేతతో మరింత జోరు పెంచనున్నాడు.
భారత క్రికెట్లో వివాదరహితుడుగా పేరొందిన ధోనీపై పరస్పర విరుద్ద ప్రయోజనాల కేసు అభిమానులకు ఒకింత ఆశ్చర్యం కలిగింది. సీఎస్కే ఆటగాడిగా కొనసాగుతున్న ధోనీ.. ఒక క్రికెట్ అకాడమీ నడుపుతున్నాడు. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్(Aarka Sports Management Private Limited) అనే అకాడమీలో ధోనీ భాగస్వామిగా ఉన్నాడు. అందుకని.. బీసీసీఐ నియమ నిబంధనల ప్రకారం అతడు పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందుతాన్నరని ఫిబ్రవరి 28న ఫిర్యాదు నమోదైంది.
The judgment determined that there was no conflict of interest in Dhoni’s participation in the Indian Premier League under current BCCI rules as the academy agreement was signed before the 2018 regulations came into force
Source: ANI#MSDhoni #IPL #CSK #BCCI #CricketTwitter pic.twitter.com/sFbMWm8O75
— InsideSport (@InsideSportIND) March 12, 2026
2017లో రిజిష్టర్
ఐపీఎల్ ప్లేయర్‌గా ఉంటూనే అకాడమీని నిర్వహించడం ద్వారా ధోనీ బీసీసీఐ నియమావళిలోని 38(4)(ఏ), 38(4)(పీ)ని ఉల్లంఘించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అంతేకాదు 2018లో బీసీసీఐ సవరించిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల నియమాలు 38(2), 38(5)ల ప్రకారం సీఎస్కే స్టార్.. తాను పొందుతున్న లాభాలను బహిర్గతం చేయలేదు. కాబట్టి ధోనీపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐని కోరారు. అయితే.. బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ అరుణ్ మిశ్రా స్పందిస్తూ ధోనీపై చర్యలుండవని తేల్చేశారు. ధోనీ క్రికెట్ అకాడమీ 2017లో రిజిష్టర్ అయిందని.. పరస్పర విరుద్ద ప్రయోజనాలకు సంబంధించిన నియమాలను 2018 సెప్టెంబర్‌లో అమలులోకి వచ్చాయని అరుణ్ మిశ్రా వెల్లడించారు. క్రికెట్ అకాడమీ నిర్ణయాల్లో ధోనీ పాత్ర పరిమితమేనని స్పష్టం చేసిన ఆయన.. ఫిర్యాదుదారు పేర్కొన్న అంశాల ప్రకారం ధోనీపై చర్యలు తీసుకోవడం కుదరని చెప్పేశారు.
🚨 IPL CSK UPDATE 🚨
•🟡 MS Dhoni landed in Chennai. Very soon, Mahendra Singh Dhoni will join the team in practice…..Seemore pic.twitter.com/7eqprRRnQ5
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 10, 2026
‘ధోనీపై వచ్చిన ఫిర్యాదు సహేతుకమైనది కాదు. ఈ కేసు వెనకాల థర్డ్ పార్టీ పాత్ర ఉంది. తనకు నష్టం కలిగించారనే కోపంతోనే ఫిర్యాదుదారు ధోనీపై కక్షపూరితంగా కేసు వేశారు. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించిన క్రికెట్ అకాడమీకి ధోనీని యజమానిగా పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఆ ఒప్పందం 2017లో జరిగింది. ఆ సమయంలోనే ధోనీ భారత జట్టు కెప్టెన్‌గా కొనసాగారు. కానీ, అతడిపై అప్పుడు పరస్పర విరుద్ద ప్రయోజనాల కేసు నమోదు కాలేదు. సో.. ఫిర్యాదుదారు ఆరోపణలను తోసిపుచ్చుతున్నాం’ అని అరుణ్ మిశ్రా వెల్లడించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

