యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్ పాలనపై ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కేటాయింపులో పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారంటూ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ( MLA Anil Kumar reddy ) ని బీఆర్ఎస్ ( BRS ) సర్పంచులు నిలదీశారు. భువనగిరిలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రసాభాసగా జరిగింది.
గ్రామాల అభివృద్ధికి నిధుల మంజూరు చేయాలని భువనగిరి, వలిగొండ మండలాల బీఆర్ఎస్ సర్పంచులు ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు.కాంగ్రెస్ సర్పంచ్ లకే నిధులు ఇస్తున్నారని ఆరోపించారు.తమకు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళా భవనాలు, సీసీ రోడ్ల మంజూరు లో చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రాజకీయాలు చేయవద్దని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.