కులకచర్ల, మే 25 : అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు కులకచర్ల ఎస్ఐ రమేశ్ తెలిపారు. కులకచర్ల మండల పరిధిలోని బొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి, రామకృష్ణలకు చెందిన రెండు ట్రాక్టర్లలో అనుమతి లేకుండా కులకచర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో నుండి ఇసుకను తరలిస్తుండగా పోలీసు సిబ్బంది పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఇసుక తరలించేందుకు ఎలాంటి అనుమతి పత్రాలు లేక పోవడంతో రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Amala Paul | కొడుకును క్రైస్తవ మతంలోకి మార్పించిన అమలాపాల్… ఎంత క్యూట్ ఉన్నాడు..!
Alia Bhatt | ఏంటి అలియా భట్ మరో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందా.. వీడియో వైరల్