Amala Paul | అందాల ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. కేరళలోని ఎర్నాకులంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు అనఖ కాగా, సినిమాలలోకి వచ్చాక అమలాపాల్‌గా పేరు మార్చుకుంది. 2009లో వచ్చిన మలయాళ చిత్రం నీలతామరతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2010లో తమిళ చిత్రం మైనాలో నటించి తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. ఇప్పుడు అడపాదడపా సినిమాలలో మెరుస్తుంది.
అమలా పాల్ 2014లో తమిళ దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకోగా, అనుకోని కారణాల వలన 2017లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2023లో అమలా జగత్ దేశాయ్ ని వివాహం చేసుకుంది. 2024 జూన్ 11న వీరికి ఇలాయ్ అనే మగబిడ్డ జన్మించాడు.ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తల్లిగా తన జీవితాన్ని ఆనందిస్తూ, సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా అమలాపాల్ తన కొడుకుకి సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ ప్రేమ శాంతితో కూడిన ఇలై బాప్టిజం జరుపుకున్నాడు అని తన పోస్ట్‌కి రాసుకొచ్చింది అమలాపాల్.
బాప్టిజం అంటే క్రైస్తవ మతంలోకి మారడం.బాప్టిజం ద్వారా ఒక వ్యక్తి పాపాలని కడిగి దేవుని సేవకుడిగా గుర్తిస్తుంది. అయితే అమలాపాల్ కొడుకు చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అమలాపాల్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.. తన భర్త జగత్ దేసాయితో డేటింగ్ చేస్తున్న సమయంలో తాను ఒక నటినని అతనికి తెలియదని ఆమె చెప్పారు. అతను ఎక్కువగా దక్షిణాది సినిమాలు చూడడు. నేను నటినని కూడా అతనికి చెప్పలేదు. కేవలం నా వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాను మాత్రమే అతనికి చూపించాను.