Alia Bhatt | బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రీసెంట్గా కేన్స్‌లో సందడి చేసింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మే 13 నుండి 24 వరకు జరగగా, చివరి క్షణాలలో వచ్చి అలియా అలరించింది. కేన్స్‌కి వెళ్లక ముందే తన స్టన్నింగ్ లుక్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘హలో కేన్స్’ అనే క్యాప్షన్‌తో అభిమానులతో పంచుకున్న ఈ ఫొటోల్లో కొంటె చూపుల్తో కాల్చేలా అలియా లుక్స్ ఉన్నాయి. అయితే కేన్స్‌లో డిఫరెంట్ డ్రెస్సులలో అలియా భట్ ఫొటో షూట్ చేస్తున్న సమయంలో అభిమానులు ఓ విషయాన్ని గమనించారు. ఆమెకి సంబంధించిన వీడియోలో అలియా కడుపు కొద్దిగా ముందుకు వచ్చినట్టు గుర్తించారు.
దాంతో అలియా భట్ మళ్లీ గర్భం ధరించిందని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందనే వార్తలు నెట్టింట షికారు చేస్తున్నాయి. అయితే దీనిని కొందరు కొట్టి పడేస్తున్నారు. అలాంటిదేమి లేదని అంటున్నారు.అలియా భట్ 2022 నవంబర్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డకు రెండున్నరేళ్లు కాగా, ఇప్పుడు అలియా మళ్లీ తల్లి కాబోతుందనే కొత్త ప్రచారం ఊపందుకోవడం గమనర్హం. అలియా భట్ పెళ్లికి ముందే ఆమె గర్భం ధరించిందని అప్పట్లో రూమర్లు వచ్చాయి. అయితే ఆ బిడ్డ ఏడు నెలలకే పుట్టిందని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వడంతో వాటికి చెక్ పడింది. అలియా భట్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
అలియా భట్ ముందుగానే కేన్స్ వెళ్లాల్సి ఉన్నా ఇండియా పాక్ యుద్ధం నేపథ్యంలో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది. శనివారం కేన్స్‌లో సందడి చేసింది. అలియా సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఫ్లోరల్ గౌన్ ధరించి నాజూగ్గా కనిపించారు. ఆ తర్వాత చీరలో మెరిసింది. ఈ చీరలో ఓపెన్ హెయిర్ స్టైల్ తో అలియా చాలా క్యూట్ గా కనిపించింది. కేన్స్ క్లోజింగ్ ఫెస్టివల్ లో ఆలియా భారతీయ సంప్రదాయ చీరకట్టుతో కనిపించడం వివేషం. ఇక గూచీకి ఆలియా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించిన విషయం తెలిసిందే.
“a night that honoured the power of women – in voice, in presence, in purpose 🤍”
——— Alia Bhatt via her Instagram pic.twitter.com/5Y5JMHIXoM— Alia’s nation (@Aliasnation) May 24, 2025