Rythu Bharosa | పెద్దేముల్, ఏప్రిల్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమకు ఇంకా రైతు భరోసా రాలేదని, రుణమాఫీ కాలేదని రైతులు వాపోయారు. ఇవాళ పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామం, ఓమ్లా నాయక్ తండాలో జైబాపు, జై భీమ్ , జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ యాత్రలో పాల్గొన్న సందర్భంగా తమకు ఇంకా రుణమాఫీ కాలేదు అని.. రైతు భరోసా డబ్బులు ఇంకా రాలేదని కొందరు రైతులు తట్టేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని నిలదీశారు. అనంతరం యాత్రనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చట్టసభ వేదికగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను అవమానించడంతోపాటు రాజ్యాంగాన్ని మారుస్తామని బాహాటంగా చెబుతుంది.
ఆ కుట్రలను తిప్పికొడుతూ వారి ఆశయాలు కొనసాగాలని రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఫహీం ఖురేషి, రాజీవ్‌రెడ్డి పెద్దేముల్ మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!