Amelia Kerr | టీ20ల్లో అమేలియా కొత్త చరిత్ర.. అత్యంత వేగంగా వెయ్యి పరుగులు, వంద వికెట్లతో రికార్డు..!
Amelia Kerr : అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ క్రికెటర్ అమేలియా కేర్ (Amelia Kerr) చరిత్ర సృష్టించింది. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా వెయ్యికి పైగా పరుగులు బాదేసి, వందకు పైగా వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌గా అమేలియా అవతరించింది.
Amelia Kerr : అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ క్రికెటర్ అమేలియా కేర్ (Amelia Kerr) చరిత్ర సృష్టించింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో చెలరేగిపోతున్న కివీస్ కెప్టెన్ రెండో టీ20 మ్యాచ్‌లో వందో వికెట్ సాధించింది. తద్వారా టీ20ల్లో ఆమె అరుదైన మైలురాయిని అధిగమించింది. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా వెయ్యికి పైగా పరుగులు బాదేసి, వందకు పైగా వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌గా అమేలియా అవతరించింది. ఈ ఆల్‌రౌండర్ 94వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సొంతం చేసుకుంది.
సంచలనాలకు నెలవైన టీ20ల్లో అమేలియా కేర్ జోరు కొనసాగిస్తోంది. ఇటీవల కాలంలో బ్యాటుతో, బంతితో చెలరేగిపోతున్న కివీస్ క్రికెటర్. నిరుడు టీ20ల్లో తొలి సెంచరీతో రికార్డులకెక్కింది. తాజాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాపై పంజా విసురుతున్న అమేలియా అత్యంత వేగంగా వంద వికెట్ల క్లబ్లో చేరింది.
Amelia Kerr as Full-Time Captain for NZ:
🔹 101* & 2/14 vs ZIM (T20I)
🔹 82 & 1/8 vs ZIM
🔹 1/12 vs ZIM
🔹 15 & 4/35 vs ZIM (ODI)
🔹 45 & 7/34 vs ZIM
🔹 80 & 5/22 vs ZIM
🔹 78 & 0/24 vs SA (T20I)
🔹 32 & 2/29 vs SAUnstoppable Amelia Kerr as Captain!!! 🔥 #NZvSA
📷 BCCI pic.twitter.com/qUfNmEhuen— CricketGully (@thecricketgully) March 17, 2026
తద్వారా ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా వెయ్యికి పైగా పరుగులు, వందకు పైగా వికెట్లతో చరిత్ర లిఖించిందీ డాషింగ్ బ్యాటర్. మొత్తంగా.. తమ దేశం నుంచి ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ తనే. ఆమె కంటే ముందు సోఫీ డెవినె, మిచెల్ శాంట్నర్ ఈ మార్క్ అందుకున్నారు.
క్యారీ చాన్.. 74 ఇన్నింగ్స్‌ల్లోనే
ఓవరాల్‌గా చూస్తే.. అసోసియేట్ నేషన్స్ క్రికెటర్ క్యారీ చాన్ 74 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని దాటింది. పురుషుల క్రికెట్లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ వెటరన్ ఆటగాడు 84 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యికి పైగా రన్స్, వందకు పైగా వికెట్లు సాధించాడు. మహిళా క్రికెటర్ల పరంగా చూసుకుంటే… దీప్తి శర్మ (భారత్), నిడా దార్(పాకిస్థాన్), ఎలీసా పెర్రీ(ఆస్ట్రేలియా), సోఫీ డెవినె(న్యూజిలాండ్), హీలీ మాథ్యూస్(వెస్టిండీస్)లు ఈ క్లబ్లో ఉన్నారు.
Amelia Kerr’s recent all-round form has been incredible 🔥 pic.twitter.com/BBGJgLTbW4
— ESPNcricinfo (@ESPNcricinfo) March 15, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

