Anganwadis | ఆనాడు చంద్రబాబు నాయుడు అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించి ఆ తర్వాత ఓడిపోయాడు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఓడిపోతాడని అంగన్ వాడీ మహిళలు హెచ్చరిస్తున్నారు. మహిళలు అని కూడా చూడకుండా మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారని.. ఈ ప్రభుత్వంలో మహిళలకు సేఫ్టీ లేదని వాపోయారు.
తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన నేపథ్యంలో ఓ అంగన్ వాడీ మహిళ మాట్లాడుతూ.. మార్పు మార్పు అంటే మమ్మల్ని రోడ్ల మీద తిప్పే మార్పు అయింది. మీ జీతం పెంచుతం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటెయ్యెండని అన్నరు. గద్దెకు ఎక్కించినం. ఇప్పుడు మమ్మల్ని చూడాలా..? వద్దా..? మాకు రూ.18 వేల చేస్తమని హామీని వాళ్లే ఇచ్చిర్రు. ఆ హామిని అడిగేందుకు వస్తమంటే ఇండ్లల్లనే అరెస్ట్ చేసిన్రు. మహిళలను ఈ విధంగా ఇందిరాపార్క్ దగ్గర తిప్పుతున్నడు. పొద్దున్నుంచి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్నం. ఈ పరిస్థితిలో కనీసం మాకు మంచి నీళ్లు కూడా లేవు. కాంగ్రెస్ సర్కార్ వస్తే మార్పు మార్పు అని చెప్పారు తప్ప మాకు రోడ్ల మీద తిరిగే మార్పు తప్ప ఇంకోటి లేదని మండిపడ్డారు.
కేసీఆర్ మా జీతాన్ని రెండు సార్లు పెంచిండు. రూ.7200 మాత్రమే ఉండే.. ఆ తర్వాత రూ.10 వేలు చేసిండు. మమ్మల్ని అసెంబ్లీకి పిలిపించి మమ్మల్ని కూర్చొబెట్టి మాతో మాట్లాడి మాకు 13, 650 చేసిండు. పీఆర్సీ చేసిండు. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి మా జీతం పెంచుతలేడు. పీఆర్సీ ఇస్తలేడన్నారు.
రేవంతన్నా అని అన్నందుకు మమ్మల్ని అరెస్టులు చేయిస్తున్నాడని మరో అంగన్ వాడీ మహిళ ఆరోపించింది. అంగన్వాడీ మహిళలు అంటే పోలీసులు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. ఎన్నికల ముందు మా ఓట్ల కోసం హామీలు ఇచ్చి, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
రేవంతన్నా అని అన్నందుకు మమ్మల్ని అరెస్టులు చేయిస్తున్నాడు
అంగన్వాడీ మహిళలు అంటే పోలీసులు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు
ఎన్నికల ముందు మా ఓట్ల కోసం హామీలు ఇచ్చి, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు – అంగన్వాడీ మహిళల ఆవేదన https://t.co/OAlTToUbjw pic.twitter.com/zjdHKaTu3g
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2026
ఆనాడు చంద్రబాబు నాయుడు అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించి ఆ తర్వాత ఓడిపోయాడు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఓడిపోతాడు
మహిళలు అని కూడా చూడకుండా మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు.. ఈ ప్రభుత్వంలో మహిళలకు సేఫ్టీ లేదు
మార్పు మార్పు అంటే మమ్మల్ని రోడ్ల మీద తిప్పే మార్పు అయింది – అంగన్వాడీ… https://t.co/587Tcncl9D pic.twitter.com/vv9bIkUEDK
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2026
Peddapalli-Palakurthy | పెద్దపల్లిలో కల్వర్ట్ను ఢీకొన్న కారు.. దంపతులు మృతి