EX MLA Methuku Anand | వికారాబాద్, ఏప్రిల్ 23 : జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా ఈ ఉగ్రదాడిని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీవ్రంగా ఖండించారు. దాడి గురించి తెలిసి మనసు చలించిపోయిందని ఆయన అన్నారు. ఈ ఉగ్ర దాడిలో మరణించిన వారి కుటుంబాలకు భగవంతుడు అండగా ఉండాలని ప్రార్ధిస్తున్నామన్నారు.
బాధితుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకుని అండగా నిలవాలి. అలాగే ఇంతటి క్రూరమైన చర్యలకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని కోరారు.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి