వరంగల్ : బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వర్ధన్నపేట నియోజకవర్గం ఆరెపల్లి గ్రామంలోని కాంగ్రెస్, బీజేపీ,సీపీఐ పార్టీల నుంచి 180 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసి గద్దెనెక్కిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్దా ఎత్తున ఆందోళన చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తి అయిన కూడా ఒక్క హామీ పూర్తి చేయలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి శూన్యం అన్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అదేవిధంగా వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.