విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘గుర్తుకొస్తున్నాయి’. యశశ్రీరావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర పాత్రధారులు. శుక్రవారం ఈ సినిమా గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని ఆవిష్కరించారు. ఇదొక జ్ఞాపకాల సమాహారమని, మన జీవితంలోని మధుర క్షణాలను గుర్తుచేస్తుందని హీరో విరాజ్ అశ్విన్ తెలిపారు.
ఓ సంఘటన కారణంగా హీరో గతాన్ని మర్చిపోతాడని, ఈ క్రమంలో పండే భావోద్వేగాలు హృదయాన్ని కదిలిస్తాయని దర్శకుడు తెలిపారు. మనం జీవితంలో మిస్ అయిన వాటిని ఈ సినిమా గుర్తుచేస్తుందని నిర్మాత శరత్చంద్ర అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అర్సాడా, దర్శకత్వం: వినోద్ గాలి.