జనగామ రూరల్, ఏప్రిల్23 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పెంబర్తిలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి వస్తున్న కేటీఆర్ఖు ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖద్వారం అయినా జనగాం మండలం పెంబర్తి గ్రామంలోని కాకతీయ కళా తోరణం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి స్వాగతం పలికారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేకల కళింగ రాజు యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్లు బాల్దే సిద్ధి లింగం, గాడిపల్లి ప్రేమలత రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, నాయకులు ఉమ్మడి శ్రీనివాస్ రెడ్డి, గద్దల నర్సింగరావు, ఉడుగుల నర్సింహులు, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.