MLA Konity ManikRao | జహీరాబాద్, ఏప్రిల్ 23 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అన్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడీగి గ్రామ శివారులోని ఎస్ఎస్వీ కన్వెన్షన్ హాల్లో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కొనింటి మాణిక్ రావు మాట్లాడుతూ.. అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. పథకాల అమలులో అధికార పార్టీ ఘోరంగా విఫలమైందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు మండలంలోని ప్రతీ గ్రామం నుంచి ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 6 గంటలకు అన్ని గ్రామాల్లో, వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ చేపట్టిన తర్వాత తమకు కేటాయించిన బస్సుల్లో, వాహనాల్లో వరంగల్ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని సూచించారు.
ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, ఝరాసంఘం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, మాజీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్, మాజీ న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, వీరారెడ్డి, రాజు పటేల్, రాజ్ కుమార్, ప్రవీణ్ కుమార్, రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అశోక్, హనీఫ్ పటేల్,యువత అధ్యక్షులు ఉమేష్ ,మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవి కుమార్, మాజి సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Drinking Water | మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపు కరువు
Kollapur Mangos | కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రావు
Rayapol ZPHS | విద్యా వెలుగులకు నెలవై.. రాయపోల్ పెద్ద బడికి నేటికి 60 వసంతాలు