దోమ, మే 29 : పిడుగుపాటుకు ఆవు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే..కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజమోని రాజు అలియాస్ చెన్నయ్యకు చెందిన ఆవు గురువారం రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన వానకు పిడుగు పడి ఆవు మృతి చెందింది. ఇటీవలే రూ. 1,20,000 వెచ్చించి తీసుకువచ్చినట్లు బాధిత పాడి రైతు రాజమోని రాజు తెలిపారు. పాడి ఆవుపై ఆధారపడి జీవనం కొనసాగించే తన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి సాయం అందించాలని బాధిత రైతు రాజు కోరుతున్నాడు.
ఇవి కూడా చదవండి..
Sircilla | ఇంత ఇసంపోసి పో.. ఎన్నికలప్పుడు ఎనెన్ని చెప్పినవ్.. రేవంత్‌పై రైతు నరసవ్వ ఆక్రోశం