పూడూరు,ఏప్రిల్ 20 : ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రదాన కార్యదర్శి యు.బుచ్చన్న ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఆదేశాల మేరకు పూడూరు మండలం నుండి సుమారుగా 2000 మంది కార్యకర్తలు వెళ్లేందుకు కృషి చేస్తునట్లు తెలిపారు.
సభకు తరలేందుకై ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు పంపిస్తునట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో అప్పుడే తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుట్టేలా బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
Jains protest | జైన దేవాలయం కూల్చివేతపై జైనులు నిరసన.. అధికారి బదిలీ
Teff Millets | మీకు తెల్ల రాగుల గురించి తెలుసా.. ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతం..
Rains | రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి