Rains | రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
Rains | తెలంగాణ రాష్ట్రం (Telangana state) లో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం ఉమ్మడి వరంగల్ (Warangal), ఖమ్మం, నల్లగొండ జిల్లాలతోపాటు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Rains : తెలంగాణ రాష్ట్రం (Telangana state) లో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం ఉమ్మడి వరంగల్ (Warangal), ఖమ్మం, నల్లగొండ జిల్లాలతోపాటు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
పొద్దంతా తీవ్రమైన ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రానికి వానలు పడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40-44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సాయంత్రం వానలు కురుస్తుండటంతో వాతావరణం కాస్త చల్లబడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో 43.4, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, ఇల్లంతకుంట, నిజామాబాద్ జిల్లాలో 42.3 డిగ్రీలు నమోదైంది.
జనగామ జిల్లా నర్మెట మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆగపేట, గండిరామవరం, వెల్దండ, అమ్మాపురం, మచ్చుపహడ్, హన్మంతాపూర్, బొమ్మకూరు తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. విద్యుత్తు తీగలు, స్తంభాలపై చెట్లు విరిగిపడి కొన్నిచోట్ల కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలాచోట్ల కోతకు వచ్చిన వరిపంట నేలవాలి ధాన్యం రాలిపోయింది.
వెల్దండలోని ఓ కొనుగోలు కేంద్రంలో క్వింటాళ్ల కొద్ది ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు పడుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

