Teff Millets | ఆరోగ్యం పట్ల ప్రస్తుతం చాలా మందిలో శ్రద్ధ పెరుగుతోంది. అందులో భాగంగానే ఆరోగ్యకరమైన ఆహారాలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రధానంగా మిల్లెట్స్‌ను అధికంగా తింటున్నారు. ఒకప్పుడు మన పూర్వీకులు, పెద్దలు చిరుధాన్యాలను అదికంగా తినేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. అందుకనే చాలా మంది ఇప్పుడు చిరు ధాన్యాలను తింటున్నారు. చిరు ధాన్యాల్లో అనేక రకాలు ఉన్నాయి. చాలా మంది తినేవాటిల్లో రాగులు కూడా ఒకటి. అయితే రాగుల పేరు చెబితే చాలా మందికి ఎరుపు రంగులో ఉండే రాగులే గుర్తుకు వస్తాయి. కానీ మీకు తెలుసా.. తెలుపు రంగులో ఉండే రాగులు కూడా ఉంటాయి. వీటిని తెల్ల రాగులు అని పిలుస్తారు. అలాగే టెఫ్ మిల్లెట్స్ అని కూడా ప్రత్యేకంగా వీటిని పిలుస్తారు. చాలా మందికి ఎరుపు రంగులో ఉండే రాగుల గురించే తెలుసు. కానీ తెల్ల రాగులు కూడా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
ఎరుపు రంగు రాగుల్లో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. అందుకనే అవి ఆ రంగులో ఉంటాయి. అయితే తెల్ల రాగుల్లో జింక్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. అందువల్ల ఎముకలు బలంగా ఉండాలనుకునే వారు తెల్ల రాగులను తినాలి. తెల్ల రాగులను తింటే జింక్ అధికంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూస్తుంది. ఈ రాగులను తినడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఉత్పత్తి అధికమవుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. తెల్ల రాగుల్లో కాపర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. రోగాలు రాకుండా రక్షిస్తుంది. ముఖ్యంగా జ్వరం వచ్చిన వారు తెల్ల రాగులతో జావ చేసి తాగుతుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
వేసవిలో రాగి జావను తాగితే ఎంతో మేలు జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తెల్ల రాగులతోనూ జావను తయారు చేసి తాగవచ్చు. ఇది శరీరానికి చలువ చేస్తుంది. వేడిని తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ బారి నుంచి రక్షించబడతారు. ఎండ దెబ్బ బారి నుంచి సురక్షితంగా ఉంటారు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. తెల్ల రాగుల్లో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలాగే నీరసం, అలసట తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ రాగులు ఎంతో మేలు చేస్తాయి. వీటితో రోజూ రొట్టెలు లేదా జావ తయారు చేసి తాగుతుంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది. తెల్ల రాగుల్లో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.
తెల్ల రాగుల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల తెల్ల రాగుల పిండి ద్వారా సుమారుగా 14 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. శరీరం యాక్టివ్‌గా ఉండేలా చూస్తాయి. కండరాలు నిర్మాణం అయ్యేందుకు సహాయం చేస్తాయి. దీంతో కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారు తెల్ల రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. మళ్లీ యాక్టివ్‌గా మారుతారు. తెల్ల రాగులను ఏ రకంగా తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటి పిండితో రొట్టెలను తయారు చేసి తినవచ్చు. లేదా జావ తయారు చేసి తాగవచ్చు. దోశలు, ఇడ్లీల తయారీకి కూడా ఈ రాగులను ఉపయోగించవచ్చు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.