హైదరాబాద్: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికి 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తన ఎక్స్ అకౌంట్లో ఓ ట్వీట్ చేశారు. బిల్ ఈజ్ పాస్డ్ అన్న టైటిల్‌తో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన క్రమాన్ని తన పోస్టులో ఆయన వెల్లడించారు. 2014, ఫిబ్రవరి 20వ తేదీన తెలంగాణ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం దక్కినట్లు చెప్పారు. శాంతియుతంగా సాగిన స్వరాష్ట్ర ఉద్యమానికి సంకేత సూచకంగా బిల్లు పాసైనట్లు హరీశ్ రావు తన పోస్టులో పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైనట్లు చెప్పారు. కేసీఆర్‌తో కలిసి విక్టరీ సంకేతం చేస్తున్న ఫోటోను తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. కొన్ని దశాబ్ధాల త్యాగం, పోరాటం, ఆత్మగౌరవం.. చివరకు కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లు హరీశ్ తన ఎక్స్‌లో తెలిపారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అన్నారు.
“THE BILL IS PASSED.”
On February 20, 2014, the #TelanganaBill was approved in the Rajya Sabha marking the victory of a relentless yet peaceful movement.
Under the leadership of #KCR Garu, decades of sacrifice, struggle, and self-respect culminated in statehood.
Jai… pic.twitter.com/pNfCStJjYj
— Harish Rao Thanneeru (@BRSHarish) February 20, 2026