హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి(Jeevan Reddy) అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. కాగా, జీవన్ రెడ్డి ఇటీవల కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్, జీవన్ రెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతోంది.
ఒక దశలో పార్టీని కూడా వీడుతానని జీవన్ రెడ్డి అలకబూనడంతో అధిష్ఠానం బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం తన వర్గం అభ్యర్థులును నిలబెట్టి గెలిపించుకున్నాడు. సీనియర్ అయిన తనను సరిగా గౌరవం ఇవ్వడం లేదని అసృంతృప్తికి లోనవుతున్నాడు. జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.