మర్పల్లి, జూన్ 17 : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని ఘనపూర్ గ్రామంలో ఉల్లిగడ్డ నీలమ్మ సోమవారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి నీలమ్మ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేలు పంపగా మాజీ ఎంపీటీసీ బిచ్చన్న, రహీం గ్రామస్తులతో కలిసి మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి నగదును అందజేశారు. కార్యక్రమంలో నాగయ్య స్వామి, మంచేందర్ గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Odisha Beach: బీచ్లో లవర్ను కట్టేసి.. 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం
KTR | కేటీఆర్ అన్న నా కుటుంబాన్ని ఆదుకో.. కాంగ్రెస్ నేత అరాచకాలతో బీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం