భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో 20 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. పది మంది ఆమెను రేప్ చేసినట్లు తెలుస్తోంది. గంజామ్ జిల్లాలోని గోపాల్‌పుర ఏరియా బీచ్(Odisha Beach)లో ఈ ఘటన జరిగింది. 20 ఏళ్ల యువతి స్థానికంగా ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతోంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గోపాల్‌పుర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆ మహిళ మరో ముగ్గురు అమ్మాయిలతో కలిసి ప్రైవేటు మెస్‌లో ఉంటోంది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆమె బీచ్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఆ అబ్బాయి ఆమె క్లాస్మేట్. రాజా ఫెస్టివల్ సందర్భంగా బీచ్‌కు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
ఓ నిర్జన ప్రదేశంలో కూర్చున్న సమయంలో.. పది మంది తమ వద్దకు వచ్చినట్లు ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నది. బాయ్‌ఫ్రెండ్‌ను బంధించి తనను రేప్ చేసినట్లు ఆమె తెలిపింది. క్రైంకు పాల్పడిన 10 మందిని అరెస్టు చేశారు. వాళ్లు విచారిస్తున్నారు. బీచ్‌కు వచ్చినవాళ్లు స్థానికులు కాదని, రాజా ఫెస్టివల్ సందర్భంగా వాళ్లు అక్కడకు వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలు, నిందితులకు మెడికల్ టెస్ట్ నిర్వహించనున్నారు.