TGCPS EU | పాపన్నపేట, జూన్ 02 : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీజీసీపీఎస్ ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంగ నర్సింహులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన పాపన్నపేటలో మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు నెలల్లో మొత్తం డీఏలు విడుదల చేస్తామని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
డీఏల విషయానికి వస్తే ఇప్పటికే ఐదు డీఏలు రావాల్సి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పెండింగ్ బిల్లులు సైతం క్లియర్ చేయాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయపరంగా తమకు రావాల్సిన హక్కుల కోసం ఉద్యమ పంతా చేపట్టాల్సి వస్తుందని మంగ నర్సింహులు పేర్కొన్నారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి