అనంతగిరి, మార్చి 16 : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడిని నిరసిస్తూ ప్రపంచ శాంతిని నెలకొల్పాలని ఆకాంక్షిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనంతగిరి మండల కేంద్రంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. యుద్ధం ప్రభావంతో గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచి పేద ప్రజలపై భారం మోపుతుందన్నారు. గ్యాస్ కొరతతో గృహిణులు ఇబ్బంది పడుతుంటే దళారులు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ ధరలను తగ్గించి, గ్యాస్ కొరత లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి యరసాని రవి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.