Heart Attack | అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) మృతిచెందాడు. భారతీయ కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం రాకేశ్ గుండెపోటుతో మరణించాడు.
రాకేశ్‌కు 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లిన రాకేశ్.. కుటుంబంతో కలిసి వర్జినీయాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. పదేళ్లుగా విదేశాల్లో ఉంటూ ఉన్నత స్థితికి చేరుకున్న రాకేశ్.. చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించాడనే వార్త వరంగల్‌లోని అతని స్వగృహంలో విషాదఛాయలను నింపింది.