MLA Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇవాళ బోయిన్ పల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఛలో వరంగల్ పోస్టర్ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు. నిధులు, ఉద్యోగాలు, జల వనరుల పంపిణీలో వివక్ష చూపడంతో తెలంగాణ ప్రజలు నష్టపోయారని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీని కేసీఆర్ స్థాపించి 25 సంవత్సరాల క్రితం పోరాటం ప్రారంభించారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు అంచుల వరకు వెళ్లి వచ్చారని, ఇది యువతకు ఎంతో మార్గదర్శకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక తెలంగాణను సాధించిన కేసీఆర్ను ప్రజలందరూ తమ గుండెల్లో పదిలపరుచుకున్నారని అన్నారు.
వరంగల్లో జరిగే రజతోత్సవ సభతో తెలంగాణ ప్రజలు తమ సత్తాను చాటుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 420 వాగ్ధానాలు చేసిందని, ఇందులో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తప్ప మిగతా హామీలను తుంగలో తొక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీల రాజకీయాలను గుర్తించిన తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ తెలంగాణ పగ్గాలను పట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు వారి నుంచి వస్తున్న స్పందనను బట్టి గుర్తించామని అన్నారు.
వచ్చే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తథ్యమని అన్నారు. ఛలో వరంగల్ సభకు కార్యకర్తలు, నాయకులు తరలి రావడానికి ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రమేష్, పరమేష్ లక్ష్మణ్ యాదవ్, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Palvancha : కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటున్న తెలంగాణ సమాజం : మాజీ మంత్రి వనమా
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్పేటలో ముందే మురిసిన గులాబీ జెండా