యాదాద్రి భువనగిరి, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ముందుచూపు సత్ఫలితాలు ఇస్తున్నది. కాళేశ్వరం దండుగ కాదు.. పండుగ అని నిరూపిస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాళేశ్వర గంగ పరవళ్లు తొకుతున్నది. కరువు తీరా కాళేశ్వరం జలం దుంకుతున్నది. పొట్ట దశలో ఎండిపోతున్న పంటలకు ఊపిరిపోస్తున్న ది. కష్టకాలంలో వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ.. అన్నదాత మోముల్లో ఆనందం నింపుతున్నది. ఆదివారం కొండపోచమ్మసాగర్ నుంచి అధికారులు నీటిని విడుదల చేయడంతో 15, 16వ ప్యాకేజీల ద్వారా భారీగా జలాలు వచ్చి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు చేరుతున్నాయి. మొన్నటిదాకా ఎండిపోయిన చెరువులు ఇ ప్పుడు నిండుకుండలా మారాయి.
వృథాగా పోతున్న మూసీ జలాలను వినియోగంలోకి తేవాలనే లక్ష్యంతో గతంలో బునాదిగాని కాలువ పనులు ప్రారంభించారు. 2006లో శంకుస్థాపన చేశారు. బీబీనగర్ మండలం మక్తానంతారం నుంచి మో తూరు మండలంలోని ధర్మారం ఊర చె రువు వరకు కాలువ నిర్మించాలని నిర్ణయించారు. ఇది భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని ఏడు మండలాల మీ దుగా వెళ్తుంది. 48 గ్రామాల్లోని 50 చెరువులను నింపుతుంది. కాళేశ్వర జలాలను బునాదిగాని కాలువలోకి మళ్లించేందుకు గత బీఆర్ఎస్ హయాంలో ప్రణాళిక రచించారు. పహిల్వాన్పురం వద్ద బునాదికాని కాలువ, కాళేశ్వరం ప్యాకేజీ-16 రెండు స మాంతరంగా వస్తున్నాయి. రెండు కాలువ లు పకపకనే ఉన్నాయి. బునాదిగాని కా లువలోకి కాళేశ్వరం జలాలు పంపించాల ని భావించి.. రెండింటినీ కలుపాలని అప్పట్లోనే నిర్ణయించారు. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి తొలిసారి బునాదిగాని కాలువలోకి పంపడంతో వలిగొండ మండలంలోని చెరువులు ఒకరోజులోనే నిండాయి. బీఆర్ఎస్ 1652.26 కోట్లతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మించగా తురపల్లి, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ ప్రాంతాలకు భారీగా వరద చేరి వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతున్నాయి. భూగర్భ జలాలు పెరుగుతుండటంతో రైతులు ఆనందంతో కేసీఆర్ చేసిన మేలును గుర్తుచేసుకుంటున్నారు.
కాళేశ్వరం నీళ్లతో పంట సమస్య తీరిం ది. రైతులకు సాగునీటి సమస్య రావద్దని మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయడం వల్ల చెరువులకు నీళ్లు చేరాయి. మా వ్యవసాయం ఆరేడేండ్లుగా సాఫీగా సాగుతున్నది. బీడు భూములకు గోదావరి జిల్లాలు తెచ్చిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డికి, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.