Final Rites | ఘట్ కేసర్, జూలై 17 : సామాన్య ప్రజలు సైతం భరించే విధంగా అంతిమ సంస్కారాల ఖర్చులు ఉండాలని ఘట్ కేసర్లో తీర్మానం చేశారు. ఘట్ కేసర్ పట్టణంలో గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఘట్ కేసర్ పట్టణ కేంద్రంలో అంతిమ సంస్కారాల న్యాయమైన ప్యాకేజీ పై ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొని న్యాయమైన ప్యాకేజీ ఉండాలని తీర్మానం చేశారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే అదే అవకాశంగా కుల వృత్తులు, పనిబాట్ల వారు, కర్మకాండలు చేసే పనివాళ్లు, అడుక్కునే వాళ్లు హక్కుదారులుగా ఇష్టం వచ్చినట్లు డిమాండ్ చేసి ఇబ్బందులు పెడుతున్న విషయంపై సమావేశంలో చర్చించారు. కొందరు వ్యక్తుల ప్రవర్తన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపించారు. అందరికి అనుకూలంగా ఆమోదయోగ్యమైన అంతిమ సంస్కారాల ప్యాకేజీ ఉండాలని పలువురు డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా కుల వృత్తులు, పనిబాట్ల వారితో చర్చించి ప్యాకేజీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సేవా సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, మాజీ చైర్మన్ సార శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్ లు, కుల సంఘాల నాయకులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం