మల్కాజిగిరి, సెప్టెంబర్ 22: రోడ్ల అభివృద్ధిపనులను త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మౌలాలి డివిజన్ సాయినాధ్పురం మెయిన్ రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలకు రోడ్లు గుంతలు పడ్డాయని, వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తామని అన్నారు. నియోజక వర్గంలోని అన్ని రోడ్లను అధికారులతో సర్వే నిర్వహించి కొత్తగా సీసీ రోడ్లు వెయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మాన్, భాగ్యనందరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Haris Rauf: రెచ్చగొట్టే సంకేతాలు చేసిన హరీస్ రౌఫ్.. పాక్ బౌలర్ ప్రవర్తనపై విమర్శలు
Sai Pallavi | బాబోయ్.. బికినీలో తళుక్కుమన్న సాయి పల్లవి.. ఉలిక్కిపడుతున్న ఫ్యాన్స్