చందుర్తి : సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని వెంగళ చెరువు ఎండిపోవడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. మల్యాల గ్రామానికి చెందిన సుమారు 75 కుటుంబాల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ నీటిని ఆలస్యంగా వదలడంతో పాటు, మరమ్మతులు చేయకపోవడం చెరువు ఎండిపోయి చేపలు మృత్యువాత పడ్డాయని పేర్కొన్నారు.
దీంతో సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు మత్స్యకారులు తెలిపారు. మిగిలిన అరకొర చేపలను కట్ట లింగంపేట గ్రామంలోని గురునాథం చెరువులోకి తరలిస్తున్నట్లు తెలిపారు.