దుబాయ్ : ఆసియాకప్‌లో దాయాది పాకిస్థాన్ జట్టుపై ఇండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సూపర్ ఫోర్ మ్యాచ్‌లో ఆదివారం ఇండియా చాలా ఈజీగా విక్టరీ కొట్టేసింది. కానీ ఆ గేమ్‌లో పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్ అనుచితంగా వ్యవహరించాడు. తన ప్రవర్తనతో అతను విమర్శల పాలవుతున్నాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. గ్యాలరీలోని ప్రేక్షకులు కోహ్లీ.. కోహ్లీ అంటూ అరిచారు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో జరిగిన సంఘటనను గుర్తు చేసే రీతిలో స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు కేకలు పెట్టారు. అయితే ఆ సయమంలో హరీస్ రౌఫ్ అర్థం కాని రీతిలో కొన్ని సంకేతాలు ఇచ్చాడు. విమానం కూలుతున్నట్లుగా అతను తన చేతులతో సిగ్నల్స్ ఇచ్చాడు. చేతి వేళ్లతో 6-0 అని చూపించాడు. ఆ తర్వాత విమానం కూలుతున్నట్లు సంకేతం ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత యుద్ధ విమానాలను కూల్చామన్న సంకేతాన్ని రౌఫ్ ఇచ్చినట్లు కొందరు విమర్శకులు అంటున్నారు.
Haris Rauf never disappoints, specially with 6-0. pic.twitter.com/vsfKKt1SPZ
— Ihtisham Ul Haq (@iihtishamm) September 21, 2025
దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో శిక్షణ చేస్తున్న సమయంలో కూడా పాక్ ఆటగాళ్లు 6-0 సంకేతం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాక్టీస్‌లో భాగంగా పాక్ క్రికెటర్లు ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో ఓ బృందం 6-0తో ముందంజలో ఉన్నది. ఆ సమయంలో పాక్ ఆటగాళ్లు 6-0, 6-0 అంటూ అరవడం మొదలుపెట్టారు. భారతీయ జర్నలిస్టుల సమక్షంలో పాక్ క్రికెటర్లు కేకలు పెట్టినట్లు తెలుస్తోంది. ఏదో ఉద్దేశంతోనే పాక్ ఆటగాళ్లు అలా అరిచినట్లు కొందరు పసికట్టారు. ఆదివారం మ్యాచ్‌లో ఛేజింగ్ చేస్తున్నప్పుడు అభిషేక్ శర్మతో కూడా హరీస్ రౌఫ్ గొడవపడ్డాడు. దీంతో హరీస్ రౌఫ్ ప్రవర్తనపై ఆన్లైన్లో ట్రోలింగ్ జరుగుతోంది.
సూపర్ ఫోర్ మ్యాచ్‌లో ఇండియా ఆరు వికెట్ల తేడాతో పాక్‌పై గెలిచింది. భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, గిల్ చెలరేగిపోయారు. ఆ ఇద్దరూ తొలి వికెట్‌కు 105 రన్స్ జోడించారు. అభిషేక్ 74, శుభమన్ 47 రన్స్ చేశారు.
Haris Rauf on what happened to his career after 23/10/2022. pic.twitter.com/1dxdN4SZ3V
— Out Of Context Cricket (@GemsOfCricket) September 22, 2025