Sai Pallavi | సాధారణంగా హీరోయిన్స్ బికినీ వేయడం అనేది కామన్. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ విదేశాలకి వెళ్లినప్పుడు, బీచ్ ప్రాంతాలలో ఎంజాయ్ చేయడానికి వెళ్లినప్పుడు బికినీ వేసి సందడి చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వెండితెరపై పద్దతిగా కనిపించే భామలు ఒక్కసారి బికినీలో కనిపిస్తే ప్రేక్షకులతో పాటు వారి అభిమానులు షాక్ అవ్వడం గ్యారెంటీ. తాజాగా మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి బికినీలో కనిపించి పెద్ద షాక్ ఇచ్చింది. సాయి పల్లవి సినిమాల్లో ఎప్పుడూ సింపుల్‌గా, గ్లామర్‌కి దూరంగా కనిపించే హీరోయిన్గా పేరు సంపాదించారు. మంచి నటన, సున్నితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆమెను అభిమానులు ‘నేచురల్ బ్యూటీ’గా అభిమానిస్తారు.
ఇలాంటి సాయి పల్లవి తాజాగా బికినీలో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ఆమె తన చెల్లెలు పూజా కన్నన్‌తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు తీసినవని తెలుస్తోంది. బీచ్‌లో జలక్రీడల్లో పాల్గొన్న సాయిపల్లవి బికినీలో కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడూ సంప్రదాయ లుక్‌లో కనిపించే సాయిపల్లవి ఇలా బోల్డ్‌గా కనిపించడం కొంతమందిని షాక్‌కు గురిచేసింది. “సాయి పల్లవి బికినీలోనా? నమ్మలేకపోతున్నాం!”, “ఇదేంటి.. ఇంతవరకు పద్ధతిగా కనిపించిన పల్లవి ఇలా మారిపోతుందని ఊహించలేదు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే మరోవైపు కొంతమంది మాత్రం సాయి పల్లవికి మద్దతుగా నిలుస్తున్నారు.ఇది ఆమె వ్యక్తిగత జీవితం. వెకేషన్లో తనకు నచ్చినట్లు డ్రెస్ వేసుకోవడం తప్పేమీ కాదు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. సాయి పల్లవి బాలీవుడ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘రామాయణ’ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ అమ్మడి బికినీ ఫోటోలు వైరల్ కావడం ద్వారా సాయి పల్లవి పర్సనల్ లైఫ్ విషయంలో పెద్ద చర్చ మొదలైంది. ఆమె ఎప్పుడూ పాత్రలకే ప్రాముఖ్యత ఇచ్చిన మంచి నటి. కానీ వెకేషన్లో బికినీ వేసుకోవడాన్ని బూతద్దంలో చూడటం అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.